హైమాస్ట్ లైట్‌కు మరమ్మతులు

GDWL: అయిజ 16వ వార్డు ఎస్సీ కాలనీలో హైమాస్ట్ లైట్ చెడిపోయి చీకట్లు నెలకొన్నాయి. కాలనీవాసులు ఇటీవల మున్సిపల్ కమిషనర్ సైదులకు విషయాన్ని తెలియజేశారు. స్పందించిన కమిషనర్ ప్రజల ఇబ్బందులను గుర్తించి, మంగళవారం భారీ క్రేన్ సహాయంతో లైట్‌కు మరమ్మతులు చేయించారు. కాలనీ ప్రజలు కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపి, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు.