గారపాటి విమలమ్మకు ఘన నివాళులు

W.G: జిల్లా మహిళా ఉద్యమ నేత జీవితం నేటి మహిళా ఉద్యమానికి స్పూర్తి దాయకమని ఐద్వా ఆకివీడు పట్టణ అధ్యక్షురాలు డోకల లక్ష్మి అన్నారు. భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో గారపాటి విమలమ్మ సంతాప సభ సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఐద్వా నాయకురాలు బి.కళ్యాణి అధ్యక్షతన జరిగిన సభలో తొలుత విమల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.