వరలక్ష్మీదేవి అలంకరణలో పార్వతీ దేవి అమ్మవారు

ATP: జిల్లాలో వరలక్ష్మీ వ్రతం వేడుకలు వైభవంగా జరుగుతన్నాయి. మహిళలు అమ్మవారి ఆలయాలకు చేరుకుని వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేస్తున్నారు. వారివారి స్వగృహాల్లో అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో వరలక్ష్మీదేవి అలంకరణలో పార్వతీ దేవి అమ్మవారు దర్శనమిచ్చారు.