VIDEO: 'త్యాగానికి తలామానికం కొమరంభీమ్'
WNP: నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరంభీమ్ త్యాగానికి తలామానికం అని ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ అన్నారు. మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో బుధవారం వనపర్తిలో ఆయన జయంతి జరుపుకున్నారు. హక్కులకోసం తెగించి పోరాడిన కొమరం భీమ్ ఆశయ సాధనకు కృషి చేయాలని రాజారామ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిరాజాచారి, దేవన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు.