ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

ADB: బేల మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. శనివారం బేల మండలంలోని సాంగిడి గ్రామంలో శ్రీ మోతిజీ మహారాజ్ ఆలయంలో L V ప్రసాద్ వారి సౌజన్యంతో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 150 మంది చికిత్స అందించారు.