మెప్మా ఆధ్వర్యంలో చలి వేంద్రాలు ప్రారంభం
AKP: నర్సీపట్నం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవి దృష్టిలో పెట్టుకొని డ్వాక్రా మహిళలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా మెప్మా సిబ్బంది పర్యవేక్షణ ఉండాలన్నారు.