ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు

ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు

అల్లూరి: రంపచోడవరం బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అక్కిస బాలు సోమవారం పరిశీలించారు. ఆహార సామాగ్రి అక్రమంగా తరలించిన ఘటన నేపథ్యంలో పర్యవేక్షణకు వచ్చినట్లు తెలిపారు. మెనూ బోర్డు, ఫిర్యాదు పెట్టె లేవని, విద్యార్థులకు పండిన అరటికాయలు వండుతున్నారని, ఆహారం సరిగా ఇవ్వటం లేదని ఆయన పేర్కొన్నారు.