VIRAL: ఒకేచోట టీ తాగుతున్న టాలీవుడ్ స్టార్లు
టాలీవుడ్ స్టార్ హీరోలంతా కలిసి ఒకే చోట సరదాగా టీ తాగుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇది నిజమైన ఫొటో కాదు.. AI సహాయంతో సృష్టించింది. అయినప్పటికీ, ఈ ఫొటోను చూసిన అభిమానులు.. అందరి స్టార్ హీరోలను ఒకే దగ్గర చూసినందుకు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోను సృష్టించిన వ్యక్తి ప్రతిభను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.