అనారోగ్యంతో సచివాలయ ఉద్యోగి మృతి
ASR: చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామ సచివాలయం-2లో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గూడెం కొత్తవీధి మండలానికి చెందిన కంకిపాటి అరుణ కుమారి గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. గత కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సహోద్యోగులు తెలిపారు. అయితే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పేర్కొన్నారు.