VIDEO: బైక్‌ను ఢీకొన్న మరో బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జాతీయ రహదారిపై బుధవారం బైకును మరో బైక్ వెనుక నుంచి ఢీకొనడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇల్లంద చెందిన సాంబయ్య తన ద్విచక్ర వాహనంపై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన సాంబయ్యను 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.