మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
WNP: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పాయిపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసముంటున్న సూర్య రాములు (58) ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు మద్యానికి బానిసై, ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యతో గొడవపడి ఈ నెల 28న ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మృతుడి కొడుకు ఫిర్యాదుతో ఎస్సై హృషికేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.