ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి: ఎంపీడీవో
WGL: పర్వతగిరి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బందితో శనివారం ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి అన్ని గ్రామాల్లో కనీసం 50 మంది కూలీలతో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో డిమాండ్ నమోదు చేసి పనులు చేపట్టాలని, నర్సరీ బ్యాగ్ ఫిల్లింగ్‌ను మూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.