పంచాయతీని విడగొట్టొద్దంటూ నినాదం

పంచాయతీని విడగొట్టొద్దంటూ నినాదం

NLR: వింజమూరు మండలం బుక్కాపురం పంచాయతీని విడగొట్టొద్దంటూ గ్రామస్థులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. పంచాయతీని విడగొట్టి చండ్రపడియను కొత్తగా పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. సర్పంచ్ చెరుకూరు నాగూరు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 10 మంది వార్డు సభ్యులకుగాను 8 మంది హాజరుయ్యారు. వారిలో 6 మంది వ్యతిరేకంగా నినదించారు.