ఆరోగ్యం జాగ్రత్త సుమీ.. అసలే చలికాలం
GDWL: విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఆరోగ్యం బాగుంటేనే విద్యార్థులు మంచి చదువులు చదవగలరని ఎంఆర్‌వో, స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున్ పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల ఎస్సి బాలుర హాస్టల్లో విద్యార్థులకు స్వెటర్లు, దుప్పట్లను వార్డెన్ రమేష్ సమక్షంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్సై ధర్మారావు, కోపరేటివ్ శాఖ అసిస్టెంట్ రిజిస్టర్ సైదులు పాల్గొన్నారు.