VIDEO: ఓటర్లను మభ్య పెట్టేందుకు నాసిరకం రోడ్లు

VIDEO: ఓటర్లను మభ్య పెట్టేందుకు నాసిరకం రోడ్లు

AKP: గత ఎన్నికల ముందు ఓటర్లను మభ్య పెట్టేందుకు మాజీ ఎమ్మెల్యే గణేష్ తూతూ మంత్రంగా నాసిరకం రోడ్లు వేశారని గొలుగొండ టీడీపీ నాయకులు గెడ్డం ఆనంద్ శుక్రవారం ఆరోపించారు. సాలికమల్లవరం వద్ద రంగురాళ్లను ఎత్తుకెళ్లి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన చరిత్ర గణేష్‌కు దక్కుతుందన్నారు. అటువంటి గణేష్ స్పీకర్ అయ్యన్నను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.