ఏర్పేడులో దారి తప్పిన శివ భక్తులు
తిరుపతి జిల్లాలో భక్తులు దారి తప్పారు. ఏర్పేడు మండలం భక్తవత్సలస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన శివభక్తులు తప్పిపోయారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా భారీ వర్షం పడడంతో కుంటలు పొంగాయి. దీంతో రోజంతా అడవిలోనే ఉండిపోయారు. కుటుంబ సభ్యులు, అధికారులకు ఫోన్లు చేయగా.. స్పందించిన ఏర్పేడు తహసీల్దార్ భార్గవి జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.