నాచారం ఇండస్ట్రియల్ ఏరియాల్లో రోడ్ల పరిస్థితి ఇది..!
MDCL: నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. అనేక చోట్ల పెద్ద గుంతలు ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితి నెలకొంది. పరిశ్రమల ప్రాంతం కావడంతో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది. అధికారులు వెంటనే స్పందించి రోడ్లను మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.