41 వేల 155 మెట్రిక్ టన్నుల దాన్యం దిగుబడికి ఛాన్స్..!
మేడ్చల్ పరిధి కీసర, ఘట్‌కేసర్, చౌదరి గూడ తదితర ప్రాంతాలలో వరి పంట కోతలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్ జిల్లాలో ఈ ఏడాది మొత్తం ఈ సీజన్‌లో 16,320 ఎకరాలలో వరి పంట సాగు చేశారు. అయితే, 41 వేల 155 మెట్రిక్ టన్నుల దాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రైతుల అవసరాలకు పోగా 25 వేలకు పైగా మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది.