రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
కృష్ణా: గుడివాడ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతులు జరుగుతున్నాయి. కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు నాగవప్పాడు, రాజేంద్రనగర్, టీచర్స్ కాలనీ, పాటిమీద, ధనియాలపేట, ఏలూరు రోడ్, రైలుపేట, బేతవోలు నిమ్మతోట, వాంబేకాలని, కార్మిక నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఈఈ శ్రీనివాసరావు ఈరోజు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.