VIDEO: '20 రోజులైనా గ్యాస్ సిలిండర్లు లేవు'
ASF: తీర్యాణి మండలంలో గ్యాస్ బుక్ చేసుకుని 20 రోజులు గడుస్తున్నా ఏజెన్సీ నుంచి సిలిండర్లు అందడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం వారు మాట్లాడుతూ.. పిల్లలకు పరీక్షలు నడుస్తున్న సమయంలో గ్యాస్ కొరతతో సకాలంలో వారికి భోజనం అందించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ వారు త్వరగా గ్యాస్ అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.