ఆరోగ్యాన్నిచ్చే వామకుక్షి విధానమిదే!
వామకుక్షి అంటే భోజనం చేసిన తర్వాత ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం. ముందుగా వెల్లకిలా పడుకుని, ఆపై నెమ్మదిగా ఎడమ వైపునకు ఒరగాలి. కుడి కాలును ఎడమ కాలుపై ఉంచాలి. మీ ఎడమ చేతిని తల కింద దిండులా అమర్చుకోవాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. మరీ గాఢ నిద్రలోకి వెళ్లకుండా, 15 - 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడమే వామకుక్షి. ఇది ప్రాచీన ఆయుర్వేదం సూచించిన అత్యుత్తమ జీవనశైలి పద్ధతి.