స్పందన కార్యక్రమానికి 268 అర్జీలు

స్పందన కార్యక్రమానికి 268 అర్జీలు

ELR: కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూల నుండి వచ్చిన అర్జిదారుల వద్ద నుండి జేసీ పి.ధాత్రిరెడ్డి అర్జీలను స్వీకరించారు. 268 ఫిర్యాదులను స్వీకరించి బాధితులకి న్యాయం చేయాలని అధికారులకి సూచించారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖలకు పంపాలన్నారు.