'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
KRNL: ఆదోని పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు.