ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతంపై అధికారులు హెచ్చరికలు
KRNL: ఆదోని పట్టణ శివారులో ప్రభుత్వ స్థలాలకు కబ్జాపై అధికారులు హెచ్చరికలు చేశారు. మంగళవారం మండగిరి పరిధిలో ప్రభుత్వ స్థలాల కబ్జాపై బీజేపీ నాయకులు ఫిర్యాదుతో మండల సర్వేయరు ఈశ్వరప్ప పంచాయతి సెక్రటరీ శ్రీనివాసులు పరిశీలించారు. ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతంపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ స్థలాలు అమ్మినా, కొనుగోలు చేసిన నేరమని ఆయన స్పష్టం చేశారు.