మర్కోడులో బోర్లు వేయాలని విజ్ఞప్తి
BDK: ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యేను కలిసి మర్కోడు గ్రామంలోని కనకదుర్గాదేవి ఆలయం, ఎస్సీ కాలనీలోని ముత్యాలమ్మ గుడి వద్ద బోర్లు వేయాలని కోరారు. ఎమ్మెల్యే 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య, సుతారి కృష్ణ, తాటి పెద్ద నీలమయ్య, వజ్జ హరికృష్ణ పాల్గొన్నారు.