'పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు వేగవంతం'

'పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు వేగవంతం'

NRML: పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయని చెప్పారు. పోలింగ్ బూతులు, సిబ్బంది నియామకం, భద్రతా చర్యలు, పోలింగ్ సామగ్రి పంపిణీపై మండల వారీగా సమీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు.