ఉద్యోగుల సమ్మె.. పురుషులకూ ఫ్రీ బస్!
TG: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రయాణికులకు వింత అనుభవం ఎదురవుతోంది. బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులను నియమించగా, కండక్టర్లు లేని చోట పురుషులకు కూడా ఉచిత ప్రయాణం లభిస్తోంది. టికెట్ వసూలు చేసే వీలు లేక అధికారులు ప్రస్తుతానికి అందరినీ ఉచితంగా అనుమతిస్తున్నారు. దీంతో మహిళలతో పాటు పురుషులు కూడా పైసా ఖర్చు లేకుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.