వృద్ధ దంపతుల దారుణ హత్య.!

BDK: కొత్తగూడెం (D) ఇల్లందుకు చెందిన వృద్ధ దంపతులు HYDలో హత్యకు గురైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృత దంపతులు కనకయ్య- రాజమ్మలు అల్వాల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వారి ఇంట్లోనే హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దుండగులు బంగారు ఆభరణాల కోసమే హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.