పోలీస్ కుటుంబాలకు చెక్కులు అందజేత

గుంటూరు: పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ సతీష్ కుమార్ చెక్కులు అందజేశారు. ఏఆర్ ఎస్సై ప్రసాదరావు సతీమణి రమ్యకృష్ణకు రూ. లక్ష, ఏఆర్ కానిస్టేబుల్ లుథియారావు సతీమణి మెర్సీగ్రేసీకి రూ.1.75 లక్షలు, ఏఆర్ కానిస్టేబుల్ సోమేశ్వరరావు సతీమణి మాధవికి రూ.1.75 లక్షల చెక్కులు అందజేశారు.