ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే
KMR: జుక్కల్ మండలం డోన్ గాంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన, సామాన్య ఓటర్లతో కలిసి క్యూ లైన్‌లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ప్రాముఖ్యత కల్గిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.