బాసరలో నిండిపోయిన అద్దె గదులు

NRML: బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలకు భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో భక్తులు బాసర చేరుకున్నారు. పుణ్యక్షేత్రంలో ప్రైవేటు హోటల్స్, సత్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి. చాలామంది భక్తులకు వసతి దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నయం లేకపోవడంతో ఆలయ పరిసరాల్లో నిద్రించారు.