VIDEO: 35 ఏళ్ల కల.. నేరవేరిన వేళ
నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలోని అమ్లికుంటలో ఉన్న ఉల్లికుంట చెరువు సుమారు 35 ఏళ్ల తర్వాత అలుగు పారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం రైతులు చెరువు వద్దకు చేరుకుని గంగమ్మకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా కాలం తర్వాత చెరువు అలుగు పారడం గ్రామస్తులకు, ముఖ్యంగా యువతకు ఆనందాన్నిచ్చింది.