'కార్మికులకు కనీస వేతన జీవో అమలు చేయకపోవడం సిగ్గుచేటు'

MHBD: గత 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది కార్మిక వర్గానికి కనీస వేతనాల జీవోను అమలు చేయకపోవడం సిగ్గుచేటని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కే సూర్యం అన్నారు. TUCI జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన సూర్యం మాట్లాడుతూ.. ఎన్నికల హామీగా కనీస వేతనాల జీవో అమలు చేయకపోవడం కార్మికులను విస్మరించడమేనన్నారు