దేశ అభివృద్ధికి మూలస్తంభాలు రైతులు: ఎమ్మెల్యే

దేశ అభివృద్ధికి మూలస్తంభాలు రైతులు: ఎమ్మెల్యే

NLR: దేశ అభివృద్ధికి మూలస్తంభాలు రైతులని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన దుత్తలూరు రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా ఎరువులు, శనగ విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు మన ఆహార దాతలు, దేశ అభివృద్ధికి మూలస్తంభాలు అని అన్నారు. వారి శ్రమకు సముచిత ఫలితం అందేలా, సమయానుకూలంగా విత్తనాలు, ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.