జూరాల అడుగంటింది... రైతుల్లో ఆందోళన
GDWL: జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు తీవ్రంగా తగ్గడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 9.657 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 0.44 టీఎంసీలే నీరు మిగిలి ఉంది. దీంతో శ్రీరంగాపూర్, వీపనగండ్ల మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల్లో చెత్త పేరుకుపోవడం, క్రాప్ హాలిడే ప్రకటనతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.