అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు

SRD: జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని సర్వే నెంబరు 10 ప్రభుత్వం భూమిలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపించారు. ఈ సందర్భంగా రెవిన్యూ అధికారులు జేసీబీ సహాయంతో నిర్మాణాలను నెల మట్టం చేశారు. ఎవరైనా సరే ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.