జిల్లాలో 3 రోజులు నీటి సరఫరా బంద్

NGKL: కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 13వ తేదీ వరకు మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ ఈఈ మణిపాల్ తెలిపారు. మిషన్ భగీరథ ప్రధాన పైపులైను మరమ్మతులు చేస్తున్నందున 11, 12, 13 తేదీల్లో కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని వెల్దండ, కల్వకుర్తి, చారకొండ, వంగూరు, ఊర్కొండ, మిడ్జిల్ మండలాలకు సరఫరా ఉండదన్నారు.