VIDEO: చండీ హోమంలో పాల్గొన్న దంపతులు
KRNL: ఎమ్మిగనూరులో నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగం ఇవాళ 13వ రోజు భక్తితో జరుగుతోంది. ఇందులో భాగంగా చండీహోమం నిర్వహిస్తున్నారు. ఈ హోమంలో 100కు పైగా దంపతులు పాల్గొన్నారు. చండీహోమం అనంతరం సీతారామచంద్ర స్వామి సహస్ర కలశాభిషేకం, సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ యాగం రేపటితో ముగియనున్నది.