VIDEO: గాలిపాలెంలో భగవాన్ వెంకయ్య ఆరాధన మహోత్సవం

NLR: చేజర్ల మండలం గాలిపాలెంలో భగవాన్ శ్రీశ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మేళతాళాల నడుమ ఘనంగా సాగిన ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పూలతో అందంగా అలంకరించారు. గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.