నేడు భైంసాలో ప్రజలకి అందుబాటులో జిల్లా ఎస్పీ

నేడు భైంసాలో ప్రజలకి అందుబాటులో జిల్లా ఎస్పీ

NRML: జిల్లాలో అనివార్య కారణాల వల్ల నిన్న వాయిదా పడిన భైంసా ప్రజావాణి కార్యక్రమం నేడు యథావిధిగా కొనసాగనుంది. భైంసా క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురావచ్చని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎస్పీ పేర్కొన్నారు.