VIDEO: అగ్నిమాపక కేంద్రంలో మొక్కను నాటిన ఎమ్మెల్యే
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ అగ్నిమాపక కేంద్రంలో సోమవారం కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి మొక్కను నాటారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫైర్ జిల్లా అధికారి కృష్ణారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఏర్నేని కుసుమ, వైస్ ఛైర్మన్ మల్లీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.