CRPF ఐజీతో విశాఖ రేంజ్ డీఐజీ భేటీ
VSP: భీమిలిలోని బక్కన్నపాలెం వద్ద 234 బెటాలియన్ CRPF ఐజీ విపుల్ కుమార్‌తో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు ఉన్నతాధికారులు LWE పరిస్థితులు, భద్రతా చర్యలు, సంయుక్త ఆపరేషన్ల సమన్వయంపై చర్చించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసు, CRPF పరస్పర సహకారాన్ని బలోపేతం చేయాలన్నారు.