దివ్యాంగులకు GOOD NEWS
PPM: జిల్లాలో దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో బుధవారం ఉదయం 11:30 గంటలకు సాలూరులో మంత్రి సంధ్యారాణి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.