ఓటు వేసిన ఎమ్మెల్యే..!

ఓటు వేసిన ఎమ్మెల్యే..!

నిర్మల్: పట్టణంలోని గాజులపేట కాలనీలో గల పంచశీల్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 123వ నంబర్ బూత్‌లో ఓటు వేసిన ఆయన, అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పటిష్ఠతకు ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.