సరిహద్దు నిర్వహణపై ఉమ్మడి అవగాహన: చైనా

సరిహద్దు నిర్వహణపై ఉమ్మడి అవగాహన: చైనా

చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూ ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనకు సంబంధించి చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో, సరిహద్దుల నిర్వహణ, నియంత్రణపై ఇరు దేశాల మధ్య ఉమ్మడి అవగాహన కుదిరిందని పేర్కొంది. ఈ చర్చలలో భాగంగా సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు సహకరించుకుంటాయని వెల్లడించింది.