రస సిద్దేశ్వరుడిని దర్శించుకున్న రాయదుర్గం కమిషనర్

ATP: రాయదుర్గంలోని కొండపై వెలసిన రస సిద్దేశ్వరుడిని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సిద్దేశ్వరుడి మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన తన సిబ్బందితో కలిసి కొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అకౌంటెంట్ ఈశ్వర్, మేనేజర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.