వాగు దాటి.. వైద్యం చేసి

ADB: ప్రజలకు సేవ చేయడానికి వైద్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. బజార్ హత్నూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి వైద్య సిబ్బంది పడ్డ కష్టాలు చూస్తే వారి అంకితభావం అర్థమవుతుంది. గ్రామానికి అడ్డుగా ప్రవహిస్తున్న వాగును తంటాలు పడుతూ దాటి, నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులు పంపిణీ చేశారు.