వెరైటీ దొంగతనం.. సింహం మాస్క్‌తో చోరీ
అనంతపురం జిల్లాలో వెరైటీ దొంగతనం జరిగింది. సాధారణంగా ఎవరైనా మాస్క్ ధరించి దొంగతనానికి పాల్పడుతారు. కానీ పామిడి మండల కేంద్రంలోని ఓ కిరాణా షాపులోకి ప్రవేశించిన దుండగుడు సింహం మాస్క్ ధరించి సామాన్లు, కొంత నగదు ఎత్తుకెళ్లాడు. చోరీ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వగా.. అది చూసిన షాపు యజమాని, పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.