క్రికెట్ ఆడే ఫ్రెండ్స్ లేరు: అర్జున్ టెండూల్కర్

క్రికెట్ ఆడే ఫ్రెండ్స్ లేరు: అర్జున్ టెండూల్కర్

తనకు క్రికెట్ ఆడే ఫ్రెండ్స్ ఎవరూ లేరని అర్జున్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫ్రెండ్స్‌లో ఎవరికీ క్రికెట్ గురించి తెలియదని, వారితో క్రికెట్ గురించి మాట్లాడను అని తెలిపాడు. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలతోనే సమయం గడుపుతానన్నాడు. ఇక తండ్రికి తగ్గ తనయుడు కాదంటూ తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని, తన ఫేవరెట్ క్రికెటర్ యువరాజ్ అని చెప్పుకొచ్చాడు.