రూ.200 కోట్ల క్లబ్‌లో 'ధురందర్'

రూ.200 కోట్ల క్లబ్‌లో 'ధురందర్'

రణ్‌వీర్ సింగ్ 'ధురందర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా భారత్‌లో రూ. 200 కోట్ల మార్క్‌ను అధిగమించింది. నిన్న 'వర్కింగ్ డే' అయినప్పటికీ, రూ.29.20 కోట్లు వసూళ్లు సాధించడం విశేషం. ఈ కలెక్షన్ల వేగాన్ని బట్టి చూస్తే, ఈ ఏడాది బాలీవుడ్‌లో 'ధురందర్' బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశం ఉంది.